సర్ప్రైజ్: ఆర్ఆర్ఆర్ నుండి సెలబ్రేషన్ సాంగ్ “ఎత్తర జెండా” విడుదల కి సిద్ధం!

Published on Mar 10, 2022 5:45 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి సెలబ్రేషన్ సాంగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ను మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఎత్తర జెండా పాట తో సినిమా చివర లో అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అని భావించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఈ పాటను విడుదల చేసేందుకు సిద్దం అవుతోంది. ఈ సెలబ్రేషన్ సాంగ్ ను మార్చ్ 14 వ తేదీన విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :