విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అర్జున్ జబ్నవీస్, నందిని, బిందు చంద్రమౌళి, ఉదయ్ తదితరులు
దర్శకుడు : సాయి కృష్ణ
నిర్మాత : సురేష్ కొమ్మినేని
సంగీతం :సుహాస్
ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ స్వయంబు
కూర్పు : సూర్య తేజ లంక
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న కథా సుధ నుంచి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే “వేడుక”. మరి లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వేద్ (అర్జున్ జబ్నవీస్) అలాగే స్వర (నందిని) ఇద్దరూ ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటారు. సంగీత రంగంలో వేద్ రాణించాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అందుకు స్వర కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది. కానీ వీరిద్దరూ అనుకోని విధంగా విడిపోవాల్సి వస్తుంది. మరి అందుకు గల కారణం ఏంటి? వేద్ అనుకున్న రంగంలో సక్సెస్ అయ్యాడా లేదా? చివరికి ఈ ఇద్దరూ కలిసారా లేదా? అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో ఎంచుకున్న సంగీత నేపథ్యం బాగా వర్కౌట్ అయ్యేలా డిజైన్ చేసుకోవడం బాగుంది. మ్యూజికల్ థీమ్ లో నడిచే కథనం, ముఖ్యంగా పాటలు ఇందులో వినసొంపుగా డీసెంట్ గా అనిపిస్తాయి. ఇక ఇద్దరు లీడ్ జంట అర్జున్, నందిని తమ పాత్రల్లో చాలా బాగా చేశారు. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ, ఎమోషనల్ పెర్ఫామెన్స్ లు నీట్ గా ప్రెజెంట్ చేశారు. అలానే అర్జున్ స్నేహితుని పాత్రలో నటుడు హీరోయిన్ తల్లి పాత్ర నటి ఇలా అంతా బాగా చేశారు.
ఈ లఘు చిత్రంలో మెప్పించే మరో అంశం. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని నీట్ గా ప్రెజెంట్ చేయడం అని చెప్పొచ్చు. మనకి ప్రియమైన వారికి మనం ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే సమయమే.. దానినే వారికి ఇవ్వలేనప్పుడు ఇక ఏం చేసిన ఎన్ని చేసినా వృథానే అవుతుంది. ఈ పాయింట్ ని చివరి కొన్ని నిమిషాల్లో మంచి మాటలతో చెప్పిన విధానం బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఇందులో పాయింట్ బాగానే ఉంది, ప్రెజెంట్ చేయడం కూడా ఓకే కానీ ఇందులో చూపించిన పాయింట్ కొత్తదేమీ కాదు. ఇది చూసాక నిన్ను కోరి లాంటి సినిమాలు ఇంకొన్ని రిలేటెడ్ సినిమాలు గుర్తు రాక మానవు. అంతే కాకుండా అక్కడక్కడా స్లో కథనం రొటీన్ సీన్స్ అంతగా ఆకట్టుకోవు. అలానే అంత ప్రేమించుకున్న ఇద్దరి నడుమ బ్రేకప్ పాయింట్ ని ఇంకొంచెం బలంగా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రానికి కావాల్సిన నిర్మాణ విలువలు మేకర్స్ బాగా పెట్టారు. నీట్ గా ప్లాన్ చేసుకున్న సెటప్ అంతా బాగుంది. ఎక్కడా లో క్వాలిటీలో లేకుండా ప్లాన్ చేసుకున్నారు. సుహాస్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాలో ఆకర్షణగా నిలిచింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ చేయాల్సింది. ఇక దర్శకుడు సాయి కృష్ణ విషయానికి వస్తే.. పైన చెప్పినట్టుగా తన వర్క్ ఇందులో బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ గా కూడా చేసే ఆస్కారం కూడా ఉంది. చెప్పాలనుకున్న పాయింట్ ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘వేడుక’ లఘు చిత్రం ఒకింత మెచ్యూర్ ప్రేమికుల కోసం అని చెప్పొచ్చు. ఇందులో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని నీట్ గా ప్రెజెంట్ చేశారు. అలాగే లీడ్ జంట బాగా నటించారు. కానీ స్లో కథనం, కొంతమేర రొటీన్ ప్లే ఇందులో సోసోగా అనిపిస్తాయి. సో ఈ లఘు చిత్రం కొంతమేర పర్వాలేదు అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
