నాల్గవ వారం “ఎవరు మీలో కోటీశ్వరులు” ఎంత టీఆర్పీ సాధించిందంటే?

Published on Sep 23, 2021 4:54 pm IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు నాల్గవ వారం కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. నాల్గవ వారం 6.59 టీఆర్పీ రేటింగ్ సాధించడం జరిగింది. మొదటి వారం నుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమం లో జూనియర్ ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్ తో షో ను నడిపిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ లు ఈ షో కి వచ్చి ప్రేక్షకులను అలరించిగా, మహేష్ బాబు గెస్ట్ గా త్వరలో రానున్నారు. మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే స్టేజ్ పై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :