“RRR” సాంగ్ వాళ్ళకే చూపించలేదట.!

“RRR” సాంగ్ వాళ్ళకే చూపించలేదట.!

Published on Sep 19, 2021 10:02 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రెడీగా ఉన్న మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన “RRR” కూడా ఒకటి. పాన్ ఇండియన్ లెవెల్లో నెవర్ బిఫోర్ బిజినెస్ జరుపుకొని సన్నద్ధం అవుతుంది. మరి ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ గా సాంగ్స్ తోనే షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి నిన్న ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ సీతారామరాజు గా నటించిన రామ్ చరణ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి పలు ఆసక్తిర విషయాలే చెప్పుకొచ్చాడు. నాగ్ సినిమా రిలీజ్ కోసం అడగ్గా మాతో రాజమౌళి అన్ని రోజులు ఒక సాంగ్ షూట్ చేయించుకొని లాస్ట్ కి అది ఎలా వచ్చిందో కూడా చూపించలేదని ఇక రాజమౌళిని సినిమా రిలీజ్ కోసం ఏమడుగుతాం అని ఫన్నీ ఆన్సర్ ని చరణ్ ఇచ్చేసాడు. దీనిని బట్టి వాళ్ళకే సినిమా రిలీజ్ పట్ల ఎలాంటి క్లారిటీ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు