అందరి దృష్టీ సమంత పైనే !
Published on Oct 12, 2017 5:20 pm IST

ఈ వారం రిలీజ్ కానున్న పెద్ద చిత్రం ‘రాజుగారి గది-2’. సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటిస్తుండంతో పెద్ద ప్రాజెక్టుగా మారిన ఈ సినిమా స్టార్ హీరోయిన్ సమంత చేరికతో అందరికీ ఆసక్తికరంగా మారింది. పైగా ఈ సినిమాలో ఆమె ప్రస్తుతంలో ఆత్మగా, గతంలో లాయర్ గా నటిస్తుండంతో ఈ ఆసక్తి ఉత్సుకతగా మారింది. అంతేగాక సినిమా క్లైమాక్స్ లో సమంత చేసే పెర్ఫార్మెన్స్ తారా స్థాయిలో ఉంటుందని దర్శక, నిర్మాతలు చెప్పడంతో హైప్ ఇంకాస్త పెరిగింది.

మరి ఆత్మగా సమంత ఎంతలా భయపెట్టింది, నటిగా ఏ స్థాయిలో మెప్పించింది రేపటితో తెలిసిపోనుంది. వీటన్నిటికీ తోడు నాగార్జున మెంటలిస్ట్ గా నటుండటం, ట్రైలర్ బాగుండటం, చిత్రంలో వెన్నెల కిశోర్ , ప్రవీణ్ లాంటి స్టార్ కమెడియన్ల ద్వారా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందేలా ఉండటంతో చిత్రానికి పాజిటివ్ వైబ్స్ బాగా కనిపిస్తున్నాయి. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పివిపి, మ్యాటనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

 
Like us on Facebook