“పుష్ప”..మాస్ డాన్ పాటని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.!

Published on Nov 20, 2021 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా పాన్ ఇండియన్ వైడ్ రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఒకదాన్ని మించి ఇంకో అదిరే చార్ట్ బస్టర్ సాంగ్ వస్తూనే ఉంది.

ఆల్రెడీ భారీ అంచనాలు ఉన్న ఈ కాంబో కి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ ఇస్తున్న ప్రతీ పాటని ఓ రేంజ్ లో బన్నీ ఫ్యాన్స్ మరియు మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిన్న వచ్చిన “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” సాంగ్ అయితే మాస్ ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది.

బన్నీ ని మాస్ డాన్ గా ప్రెజెంట్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు భారీ రెస్పాన్స్ తో కూడా దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందులోని సాహిత్యం దానికి తగ్గట్టుగా బీట్స్ విజువల్ గా బన్నీ యాటిట్యూడ్ ని ఈ సాంగ్ విన్నవారు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే “పుష్ప” ఆల్బమ్ పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More