ఒక్క మాటతో అందరి మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ !

30th, March 2017 - 08:40:07 AM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన సహృదయాన్ని, మంచితనాన్ని చాటుకున్నాడు. నిన్న జరిగిన ఐఫా ఉత్సవంలో ‘జనతాగ్యారేజ్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆయన అక్కినేని నాగార్జున నుండి అవార్డు అందుకునే సమయంలో తనతో పాటు ఉత్తమ నటుడు అవార్డు కు నామినేట్ అయిన అందరు నటులకు ఈ అవార్డు లో భాగముందని, ఇది తెలుగు పరిశ్రమ యొక్క సమిష్టి కృషి అని అన్నారు. ఆ మాట వినగానే అందరూ తమ కరతాళ ధ్వనులతో ఎన్టీఆర్ ను అభినందించారు.

అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసి దాని ద్వారా నేచర్ యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పిన కొరటాల శివకు తన ధన్యవాదాలని, ఈ సినిమా తనకు జీవితం మొత్తం గుర్తుండిపోతుందని అన్నారు. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ లిరిసిస్ట్ (రామజోగయ్యశాస్త్రి), ఉత్తమ దర్శకుడు (కొరటాల శివ), ఉత్తమ నైపథ్యగాయని (గీతా మాధురి) క్యాటగిరీల్లో కూడా అవార్డులు సొంతం చేసుకుంది.