‘సైరా’ విషయంలో అంతా సజావుగానే సాగుతోంది !

గత ఏడాది డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం ‘సైరా’ రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు ఈ షూట్ జరగ్గానే బ్రేక్ తీసుకున్నారు టీమ్. కానీ షూట్ చిరు సంతృప్తి చెందే విధంగా జరగలేదని పుకార్లు పుట్టుకొచ్చాయి. దానికి తోడు మెగాస్టార్ సినిమా కోసం పెంచిన గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లో కనబడేసరికి ఆ పుకార్లు ఇంకాస్త ఊపందుకున్నాయి.

తీరా ఈ విషయంపై ఆరా తీస్తే అలాంటిదేం లేదని, అనుకున్నట్టుగానే షూట్ జరుగిందని, ఇక చిరు నార్మల్ లుక్ లోకి రావడం వెనుక షెడ్యూల్, షెడ్యూల్ కు ఉన్న గ్యాప్ కారణమని, కన్నవారి నెలాఖరులో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది కాబట్టి చిరు సాధారణ లుక్ లోకి వచ్చి ఇతర పనులు చూసుకుంటున్నారని తెలిసింది. దీన్నిబట్టి మెగా ఫ్యాన్స్ సినిమా విషయంలో ఎలాంటి కంగారుపడాల్సిన పనిలేదని రూఢీ అయింది. రామ్ చరణ్ నిమిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.