“గాడ్ ఫాథర్” కి ప్రతీది పక్కాగా అట.!

Published on Jul 5, 2022 8:30 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం “గాడ్ ఫాథర్” నుంచి నిన్ననే అవైటెడ్ ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ ఇప్పుడు రాగా ఇందులోనే మేకర్స్ ఆల్రెడీ సినిమా రిలీజ్ టైం ని కూడా అనౌన్స్ చేసేసారు. అయితే మరి ఈ గ్యాప్ లో మాత్రం మేకర్స్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఫస్ట్ సింగిల్ నుంచి మెగాస్టార్ బర్త్ డే వరకు కూడా ఎలాంటి అప్డేట్స్ మరియు టీజర్ ట్రైలర్ లను రిలీజ్ చెయ్యాలి అనేవి పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఆచార్య ఎఫెక్ట్ ఏం ఉండకుండా మంచి ప్లానింగ్ తో ఈ సినిమా హైప్ ని ఓ రేంజ్ లో సెట్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నట్టు టాక్. ఆల్రెడీ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ స్టార్ట్ అయ్యింది. ఇక రిలీజ్ నాటికి అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :