మాజీ సీఎం చంద్రబాబు కి కరోనా పాజిటివ్

Published on Jan 18, 2022 10:50 am IST


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని, స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. తన ఇంట్లో క్వారంటైన్ లో ఉంటూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనను ఇటీవల కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోవాలి అని, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని కోరారు.

సంబంధిత సమాచారం :