రామ్‌ చరణ్ సరికొత్త రేంజ్ ను చూస్తారట !

Published on Nov 15, 2021 3:00 pm IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా సాంగ్ ను ఈ రోజు షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ చేస్తున్నారు. అయితే, ఈ సాంగ్ కంపోజ్ గురించి జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ హీరోతో పని చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.

మా హీరో రామ్ చరణ్ సర్ మరోసారి మాతో కలిసి చేసిన రిహార్సల్స్‌ ని బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఈ సినిమాలో వచ్చే సాంగ్ లో రామ్‌ చరణ్ సర్ యొక్క సరికొత్త రేంజ్ ను చూస్తారు. ఆశ్చర్యకరమైన RC15 కోసం ఆసక్తిగా వేచి ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు. అలాగే చరణ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా జానీ మాస్టర్ పోస్ట్ చేశారు.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. కాగా శంకర్, ఈ సినిమాలో చరణ్ ను వినూత్నంగా చూపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :

More