“సర్కారు వారి పాట” అప్డేట్ పై పెరుగుతున్న ఎగ్జైట్మెంట్!

Published on Feb 11, 2022 12:43 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో సినిమా ఫస్ట్ సాంగ్ పై సాలిడ్ హైప్ ఇప్పుడు ఓ రేంజ్ లో నెలకొంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈ సాంగ్ పై ఏకంగా నాలుగు అప్డేట్స్ ని అందిస్తామని తెలిపారు. మరి ఈరోజు ఫిబ్రవరి 11 అప్డేట్ డే వచ్చింది. దీనితో ఈరోజు వచ్చే అప్డేట్ పై మంచి ఎగ్జైట్మెంట్ నెలకొంది. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ సహా నిర్మాతలు కూడా సస్పెన్స్ ఫుల్ పోస్టులతో మరింత ఆసక్తి రేపుతున్నాడు. దీనితో ప్రోమో ఏమన్నా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :