చిరు – బాబీ మాస్ ప్రాజెక్ట్ బ్యాక్ డ్రాప్ పై ఎగ్జైటింగ్ ఇన్ఫో!

Published on Dec 9, 2021 7:03 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో మెగా మాసివ్ ప్రాజెక్ట్ దర్శకుడు కే ఎస్ రవీంద్ర బాబీతో తీస్తున్న సినిమా కూడా ఒకటి. చిరు 154వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే “వాల్తేర్ వీరయ్య” అనే పవర్ ఫుల్ టైటిల్ పరిగణలో ఉన్న ఈ చిత్రాన్ని వింటేజ్ మెగాస్టార్ ని పరిచయం చేసే విధంగా బాబీ ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఇప్పుడు అసలు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ పై ఆసక్తికర సమాచారం వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ ఒక అండర్ కవర్ కాప్ లా కానీ ఏజెంట్ లా కానీ కనిపిస్తారట. అంతే కాకుండా శ్రీలంక నేపథ్యంలో కూడా ఏదో లింక్ ఉంటుందని టాక్. మరి ఇందులో చిరు సింగిల్ రోల్ చేస్తున్నారా డ్యూయల్ రోల్ చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం బాబీ ఫుల్ మీల్స్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :