ఎగ్జైటింగ్ ఇన్ఫో..బాలయ్య షోలో సూపర్ స్టార్..డీటెయిల్స్ ఇవే!

ఎగ్జైటింగ్ ఇన్ఫో..బాలయ్య షోలో సూపర్ స్టార్..డీటెయిల్స్ ఇవే!

Published on Dec 1, 2021 3:35 PM IST

నందమూరి నటసింహం నందమూరి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” రిలీజ్ ఓ పక్క రెడీగా ఉండగా ఇంకో పక్క తన ఫస్ట్ ఎవర్ ఓటిటి షో “ఆహా” లో “అన్ స్టాప్పబుల్” చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి స్టార్టింగ్ నుంచే సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఫస్ట్ కొన్ని ఎపిసోడ్ లు చేసి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ షురూ చేశారు. అయితే ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ సమాచారం తెలుస్తుంది.

ఈ షోలో బాలయ్యతో సూపర్ స్టార్ మహేష్ స్క్రీన్ పంచుకోనున్నారట. ఇది కన్ఫర్మ్ కాగా.. ఈ సూపర్ పవర్ ఎపిసోడ్ ని ఈ డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ స్టార్ట్ చేసుకోనుందట. మరి ఈ అదిరే ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కి రానుందో చూడాలి. అలాగే ఇంకో పక్క మహేష్ ఎన్టీఆర్ తో పాల్గొన్న “ఎవరు మీలో కోటీశ్వరులు” ఎపిసోడ్ కూడా వచ్చే ఆదివారం టెలికాస్ట్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు