“RRR” వరల్డ్ వైడ్ రిలీజ్ పై ఎగ్జైటింగ్ టాక్.!

“RRR” వరల్డ్ వైడ్ రిలీజ్ పై ఎగ్జైటింగ్ టాక్.!

Published on Dec 29, 2021 7:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” జస్ట్ ఇంకొద్ది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ ని హిట్ చేసేందుకు రెడీగా ఉంది. అయితే ఇక ఈ తక్కువగా ఉన్న సమయంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వని అన్ని భారీ స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అయితే మొదట పాన్ ఇండియన్ లెవెల్లో మొత్తం 5 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు వేరే లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న ఎగ్జైటింగ్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. అలాగే ఇందులో ఆంగ్ల అనువాదం కూడా ఉందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. దీనితో పాటుగా ఈ చిత్రం 3డి లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు