‘డ్రాగన్’ ఇంటర్వెల్ పై క్రేజీ న్యూస్ ?

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారట. ఈ సెట్ లో రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఎన్టీఆర్ పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. వచ్చే నెల చివర్లో ఈ సెట్ లో షూట్ చేసే అవకాశం ఉంది.

అన్నట్టు ఎన్టీఆర్ ఊహించని విధంగా గాయానికి లోనైన సంగతి తెలిసిందే. విజయవంతంగా ఎన్టీఆర్ కి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం తారక్ రెస్ట్ తీసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట.

Exit mobile version