మహేష్ ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ కృష్ణ ?


మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ లోపు మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ప్రారంభించాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నాడు. మహేష్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడనే విషయమే అభిమానులను ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తుంటే అంతమించిన న్యూస్ ఒకటి మీడియాలో సర్కులేట్ అవుతోంది.

ఈ చిత్రంలో కృష్ణ ఓ కీలకమైన పాత్రలో మెరవనున్నాడనేది ఈ వార్తల సారాంశం. మహేష్, కృష్ణతో కలసి నటించి చాలా కాలం అవుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈచిత్ర తరువాత షెడ్యూల్ ని లక్నోలో ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ మహేష్ సరసన నటిస్తోంది. కాగా మహేష్ హీరోగా నటించిన రాజకుమారుడు, వంశి, టక్కరి దొంగ వంటి చిత్రాల్లో కృష్ణ మెరిశారు. చాలా కాలం తరువాత వీరిద్దరూ తెర పై మెరిస్తే అది అభిమానులకు పండగే అవుతుంది.