‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ అనంతరం జరగనున్న షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట. అలాగే, ఈ సెట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా తీస్తారని.. ఈ సీన్స్ ను అల్లు అర్జున్ పై షూట్ చేస్తారని తెలుస్తోంది.
కాగా ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
