ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : అల్లు శిరీష్ – ‘బన్నీ’ నాకు తండ్రిలాంటి వాడు !

ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : అల్లు శిరీష్ – ‘బన్నీ’ నాకు తండ్రిలాంటి వాడు !

Published on Aug 3, 2016 6:55 PM IST

Allu-Sirish
‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం రిలీజ్ సందర్బంగా ఆ చిత్ర హీరో ‘అల్లు శిరీష్’ తో ముచ్చటించగా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపించారు. ఇంటర్వ్యూ లో ఈ యువ హీరో తన మనసులోని మాటలను, తన వ్యక్తిగత, తమ మెగా కుటుంబానికి సంబందించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం…

ప్ర) మీరు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. మీలో రిలీజ్ టెంక్షన్ లేదా ?
జ) నేను చాలా సరదాగా ఉంటాను. లైఫ్ లో దేనికీ పెద్దగా టెంక్షన్ పడను. ఇక రిలీజ్ విషయానికొస్తే ఈ సినిమాతో మేము ఎలాంటి అవుట్ ఫుట్ అనుకున్నామో అదే వచ్చింది, దాని మీద మాకు నమ్మకముంది. ఇకపోతే ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది.

ప్ర) ట్రైలర్ల నుంచి చూస్తే ఈ సినిమాకి అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కారణం ?
జ) నా మొదటి రెండు సినిమాల విషయంలో ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం టైటిల్, ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి ట్రైలర్స్ వరకూ అన్నింటినీ బాగా ప్రమోట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ మీద నాకు బాగా నమ్మకంగా అనిపించింది. అందుకే సినిమా చేసేటప్పుడు నా సొంతం అనుకుని చేశాను.

ప్ర) ఈ టైటిల్ మీ సినిమాకు ఎలా యాప్ట్ అయింది ?
జ) ఈ టైటిల్ లో మంచి పాజిటివ్ ఫీల్ ఉంది. అలాగే ఈ టైటిల్ చిరంజీవిగారి పాత సినిమా టైటిల్ అని తెలిసింది. అందుకే దాన్ని వెంటనే లాక్ చేశాం. అలాగే ఈ సినిమాకి మంచి సంతోషకరమైన ఎండింగ్ తో పాటు ఇందులో మంచి బంధాలు, అనుబంధాలు ఉంటాయి. అందుకే ఈ టైటిల్ బాగా సరిపోయింది.

ప్ర) ఈ సినిమా మీ కెరీర్ కు చాలా ముఖ్యం కాబట్టి అంత బాగా ప్రమోట్ చేస్తున్నారా ?

జ) అదేమీ లేదు. మీకు ఫైనల్ ప్రోడక్ట్ మీద నమ్మకముంటే ప్రమోట్ చెయ్యాల్సిందే. ఈ సినిమా రఫ్ కట్ చూడగానే నాకు అదే నమ్మకం కలిగి బాగా ప్రమోట్ చెయ్యాలని ఫిక్సయ్యాను. పైగా అమీర్ ఖాన్ గజినీ సినిమాకి పనిచేయడం వలన సినిమాని ప్రేక్షకులకు దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలిసింది.

ప్ర) మీరు సినిమాకు ఓవర్ హైప్ క్రియేట్ చేస్తున్నారని మీకనిపించలేదా ?
జ) చూడండి, మొదటిరోజు నుండి మేము పేక్షకులకు ఉన్నదే చెబుతున్నాం. పైగా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయబడింది. సినిమాలో మూడు పాటలుంటాయి, విలన్ ఉండడు చాలా సింపుల్ గా ఉంటుంది. పైగా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మా భాద్యత. ఈ సినిమాలో ప్రేక్షకులు ప్రమోషన్లో మేము చెప్పిందే చూస్తారు.

ప్ర) గత సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగున్నారు. ఇందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
జ) కెమెరా ముందు ఎలా ఉండాలో, ఎలా కనబడాలో నేర్చుకున్నాను. ముంబై వెళ్లి నా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ వంటి చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేసుకున్నాను. అవే నన్నిలా మార్చాయి.

ప్ర) మీ సినిమాలో కొందరు సీనియర్ యాక్టర్లున్నారు. వాళ్ళతో పనిచేసేటప్పుడు ఎలా అనిపించింది ?
జ) నేను ఇండస్ట్రీలో పుట్టాను. చాలా మందితో నాకు ముందే మంచి పరిచయముంది. అలీగారితో నాకు మంచి స్నేహం. అదే సెట్స్ లో నాకు హెల్ప్ అయింది. నా పెర్ఫామెన్స్ లో కూడా సాయపడింది.

ప్ర) మీ నటన, మీ సినిమాలు పట్ల మీ కుటుంబం ఎలా ఆలోచిస్తుంది ?
జ) చిరంజీవిగారికే సినిమాలాంటే ఇష్టం. అయన నాకు వ్యక్తిగతంగా సలహాలిస్తుంటారు. ఇక నాన్న,అన్నయ్య విషయానికొస్తే వాళ్లు కొంచెం క్రిటికల్. అంతా నాలోనే ఉందంటారు. వాళ్ళ సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంటాయి.

ప్ర) కెరీర్ పరంగా ‘అల్లు అర్జున్’ మీకెలాంటి సలహాలిచ్చాడు ?
జ) బన్నీ నాకు తండ్రిలాంటి వాడు. అతని ఉదేశ్యాలను నా మీద రుద్దడు. కొత్త జంట సినిమా తరువాత రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే పాత్రలు చేయమని అతనే నాకు సలహా ఇచ్చాడు. ఏది చేసినా నాకు కంఫర్ట్ గా ఉండేదే చేయమంటాడు. నేను చాలా ఓపెన్ కాబట్టి అలాంటి పాత్రలే ప్రేక్షకులకు నన్ను దగ్గర చేస్తాయని చెప్పేవాడు.

ప్ర) ఇప్పటి కాలంలో వస్తున్న విమర్శలను మీరెలా ఎదుర్కుంటారు ?
జ) ఐదేళ్ల క్రితం వరకు చాలా సున్నితంగా ఉండేవాడిని. అన్నిటికీ ఫీలయ్యేవాడిని. కానీ రోజులు మారాయి. షారుఖ్ లాంటి గొప్ప నటుల దగ్గర్నుంచి అందరికీ విమర్శలు కామన్ అయిపోయాయి. కాబట్టి అన్నింటినీ లైట్ గా తీసుకోవడమే.

ప్ర) ‘త్రిపాఠి’తో పని చేయడం ఎలా ఉంది?
జ) సినిమా ముందు వరకూ లావణ్య నాకు పెద్దగా తెలీదు. సినిమా చేసేటప్పుడే బాగా పరిచయమైంది. ఆమెలో గొప్ప టాలెంట్ ఉంది. బాగా కష్టపడుతుంది. ఆమెలో దాగి ఉన్న టాలెంట్ ని సినిమా తీసేవాళ్ళే బయటకు తీయాలి.

ప్ర) మీ బ్యానర్ లో మీరు సినిమా నిర్మిస్తారా ?

జ) ఇప్పటి వరకూ అయితే నటన మీదే దృష్టి పెట్టాను. ఇంకో ఐదారేళ్ళ వరకూ ప్రొడక్షన్ జోలికి పోను. నాన్నకు నిర్మాణ రంగంలో 40 ఏళ్ల అనుభవం ఉంది. అందులో ఎన్ని కష్టాలుంటాయో తెలుసు. ఇప్పటికైతే దానికి దూరంగా ఉండాలనే అనుకుంటున్నాను.

ప్ర) చివరాగా మీ పెళ్లి ఎప్పుడో చెబుతారా ?
జ) నవ్వుతూ … ఇంకా దానికి నాలుగేళ్లు పడుతుంది. నటుడిగా నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నన్ను నేను నటుడిగా నిరూపించుకోవాలి. ప్రేక్షకులు స్క్రీన్ మీద నన్ను చూడడానికి ఇష్టపడేలా చేసుకోవాలి. అందుకు చాలా కష్టపడాలి. పైగా నా కెరీర్ కు ఉపయోగపడే కథలను ఎంచుకోవాలి.

ఇంతటితో అల్లు శిరీష్ తో ఇంటర్వ్యూ ముగిసింది. ఆయన సినిమా విజయవంతమవ్వాలని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు