ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ : ఛార్మి – ఇప్పుడు నా ధ్యాసంతా నిర్మాణం పైనే !

Published on May 16, 2019 3:17 pm IST

 

టాలెంటెడ్ అండ్ చార్మింగ్ బ్యూటీ ఛార్మి తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై 15 ఏళ్ళు ఐపోతుంది. ముద్దొచ్చే అందంతో పాటు ముక్కుసూటి తనం ఉన్న ఛార్మి హీరోయిన్ గా ఓ నిర్మాతగా ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులను చూసారు. రేపు ఆమె పుట్టిన రోజును సందర్భంగా బబ్లీ గర్ల్ ఛార్మి తో ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ మీకోసం.

ప్రశ్న:మొదటి ప్రశ్నగా, మీరు ఎందుకు యాక్టింగ్ మానేశారు?

చార్మి:(నవ్వుతూ)నాకు 13 ఏళ్ల ఏజ్ నుండి నేను సినిమాలలో నటిస్తున్నాను. ఇప్పటివరకు అన్ని భాషలో కలిపి 55పైగా సినిమాలలో నటించాను. ఇన్నేళ్ల కెరీర్ లో ఓ నటిగా అన్ని ఒడిడుకులు నేను అనుభవించాను. ప్రస్తుతం నా కెరీర్ గురించి నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఏ ప్రొఫషన్ లో నైనా ఓ దశ తరువాత అందరికి తర్వాతేంటి అనే సందేహం కలుగుతుంది. అలాగే నాకు అనిపించి మూవీ ప్రోడ్యూసింగ్ లోకి అడుగుపెట్టాను. ఇది నాకు బాగా నచ్చింది నేను ఆస్వాదిస్తున్నాను.

ప్రశ్న:నిర్మాతగా మారిన తరువాత కూడా మీకు యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయా?

చార్మి:ఎస్, ప్రతి రోజు నాకు కొన్ని యాక్టింగ్ అవకాశాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని నేను సున్నితంగా తిరస్కరిస్తుంటాను. ఇప్పడు నా ధ్యాసంతా నిర్మాణం పైనే, యాక్టింగ్ కి మనసులో ఫుల్ స్టాప్ పెట్టేశాను.

ప్రశ్న:పూరి కనెక్టట్స్ సంస్థలో మీ రోల్ ఏమిటీ?

చార్మి:పూరి కనెక్ట్స్ అనేది ఓ పెద్ద కుటుంబం లాంటిది. అందులో పనిచేసే చాలా మంది నా వయసు వారే. పూరి సర్ మా అందరికి బాస్. ఆయన గైడ్ లైన్స్ లో మేమందరం కలిసి పనిచేస్తుంటాం. మూవీ నిర్మాణం, దాని ప్రమోషన్,విడుదల వంటి ముఖ్యమైన విషయాలు నేనుచూసుకుంటాను.

ప్రశ్న:మీరు స్రిప్ట్ కూడా రాస్తుంటారు?

చార్మి:కొంత వరకు అవుననే చెప్పాలి …, స్క్రిప్ట్ లో పర్ఫెక్షన్ కొరకు అందరం కలిసిపనిచేస్తుంటాం. తక్కువ సమయంలో షూటింగ్ కంప్లీట్ ఐయ్యేలా నేను జాగ్రత్త పడుతుంటాను. కొన్ని సార్లు అనుకున్న ప్రకారం పని జరగకపోతే చిరాకొచ్చేస్తుంది. అంతే తప్ప నేను ఎప్పుడు అందరితో సరదాగా, ప్రశాంతగా ఉంటాను.

ప్రశ్న:ఇస్మార్ట్ శంకర్ టీజర్కి వస్తున్న ఆదరణ ఎలావుందీ?

చార్మి:ఇస్మార్ట్ శంకర్ టీజర్ కి వస్తున్న ఆదరణ అద్భుతం అనిచెప్పాలి. నాకు వస్తున్న ఫోన్ కాల్స్ అందుకు సాక్ష్యం. ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాదిస్తుందని నేను గట్టినమ్మకంగా చెప్పగలను.రామ్ టీజర్ లో చంపేశారు…, పూరి సర్ మరలా ఫామ్ లోకొచ్చారని గట్టిగా వినిపిస్తున్న మాట.

ప్రశ్న:ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత వరకు కంప్లీట్ ఐయ్యింది?

చార్మి:మూడు పాటలు మినహా,మూవీ టాకీ పార్ట్ మొత్తము పూర్తయ్యింది. ఆ సాంగ్స్ విదేశాలలో చిత్రికరించాలని అనుకుంటున్నాం. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ సర్ప్రైజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించాలని చూస్తున్నాం. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం.

ప్రశ్న:పూరి కనెక్ట్స్ ఇతర నిర్మాణ సంస్థలలో కలిసి పనిచేసే అవకాశం ఉందా?

చార్మి:ప్రస్తుతం మా సంస్థ పరిధిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. మంచి సినిమాలు తీయడమే మాసంస్థ ముఖ్య ఉద్దేశం. అలాంటి మంచి ఉదేశ్యం ఉన్న ఏసంస్థ తో కలవాల్సి వచ్చిన మేము సిద్దమే.

ప్రశ్న:పూరి కనెక్ట్స్ భవిష్యత్ ప్రణాళికల గురించి చెవుతారా?

చార్మి:ఆకాష్ పూరి హీరోగా ఓ రొమాంటిక్ లవ్ ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. దానితో పాటు ఓ కొత్త దర్శకుడితో ఓ మూవీ చేసే ఆలోచన వుంది.

ప్రశ్న:ఇప్పటివరకు మీ సినిమా కెరీర్ ఎలా అనిపించింది?

చార్మి:ఇప్పటివరకు నా సినిమా జీవితం గురించి నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. ఇన్నేళ్ల సినిమా కెరీర్ నాకు చాలా తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఒక ప్రొడ్యూసర్ గా జీవితంలో పెద్ద భాద్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ బాధ్యతలను నేను ప్రేమిస్తున్నాను, ఇంకొన్నాళ్ళు ప్రొడ్యూసర్ గా బిజీగా ఉంటాను.

ఛార్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఆమె నిర్మిస్తున్న మూవీ కి సక్సెస్ విషెస్ తెలుపుతూ, ఇంటర్వ్యూ ముగించడం జరిగింది.

 

 

సంబంధిత సమాచారం :

More