ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : జగపతిబాబు – ఈ క్రేజ్ క్రెడిట్ అంతా సాయి కొర్రపాటికే దక్కుతుంది !
Published on Jul 13, 2017 6:01 pm IST


నటుడి నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మంచి సక్సెస్ చూసిన నటుడు జగపతిబాబు ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ రోల్ లో చేస్తున్న చిత్రం ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’. రేపే విడుదలకానున్న ఈ సినిమాకు సంబందించి కొన్ని విశేషాలను ఆయన మా 123తెలుగుతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. మీరు టెంక్షన్ ఫీలవుతున్నారు ?
జ) అవును టెంక్షన్ గానే ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత హీరోగా చేశాను. పటేల్ ఎస్.ఐ.ఆర్ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలనుంది. నిర్మాత సాయి కొర్రపాటి ప్రమోషన్లకి ఎక్కువగా ఖర్చు చేయడంతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.

ప్ర) మీరు ఈ సినిమా చేయడానికి కారణం ?
జ) నేనీ సినిమా చేయడానికి నిర్మాత సాయి కొర్రపాటి, దర్శకుడు వాసు ప్రధాన కారణం. నన్ను నాకంటే ఎక్కువగా వాళ్లే నమ్మారు. వాళ్ళ కోసమైన సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.

ప్ర) సినిమా విజయం మీద ఎంత నమ్మకంగా ఉన్నారు ?
జ) సినిమా అన్ని చోట్ల బాగా ఆడుతుందనే నమ్మకముంది. ఫైనల్ ప్రోడక్ట్ అలా ఉంది. ముఖ్యంగా సినిమాలోని ఏమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటాయి.

ప్ర) సినిమా గురించి ఇంకేమైనా చెప్పండి ?
జ) ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామా. కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. టీజర్లో చూపించిన చిన్న పాప, నటి తాన్య హోప్ చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ప్ర) మీ లుక్ బాగా క్లిక్ అయింది. దాని గురించి చెప్పండి ?
జ) నా దర్శకుడికి నా లుక్ కొత్తగా, స్టైలిష్ గా ఉండాలని చెప్పాను. పాత్ర ఇలా ఉండాలి అనే బేసిక్ ఐడియా నా మైండ్ లో ఉంది. దాని ప్రకారమే నా స్టైలిస్ట్ నాకీ లుక్ ఇచ్చాడు. నా లుక్ కన్నా సినిమాలో నా అప్పియరెన్స్ నా పాత్రలోని యాటిట్యూడ్ ను చూపిస్తుంది.

ప్ర) ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏయే అంశాలను చూస్తారు ?
జ) సినిమాలోని ప్రధాన పాత్ర తర్వాత నా పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది చూస్తాను. ఒకసారి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తే ఎలాంటి పాత్రైనా చేస్తాను. వీటి వలనే ‘లెజెండ్, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో నా క్యారెక్టర్స్ అంత బాగా హిట్టయ్యాయి.

ప్ర) మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ?
జ) అమితాబచ్చన్ అంటే నాకు చాలా ఇష్టం. అయనలాగే విభిన్నమైన పాత్రలు చేయాలనుంది. ఆయన వయసులో పెద్ద పాత్రలు చేసినా హీరోలానే ఉంటారు. అందుకే ఆయనలా చేయాలనుకుంటున్నా. పైగా ఆయనకు నాకు వాయిస్ పరంగా, కెరీర్ గ్రోత్ పరంగా చాలా పోలికలున్నాయి.

ప్ర) ప్రస్తుతమున్న హీరోల్లో మీకు ఎవరేంటి ఎక్కువ ఇష్టం ?
జ) అల్లు అర్జున్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మెగా హీరో అనే ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా కేవలం తన టాలెంట్ తో ఎదుగుతున్నాడు. అతని నటన, డాన్స్, కష్టపడే తత్వం నాకిష్టం. అతని తర్వాత నాని మంచి నటుడని అనిపిస్తాడు.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) రామ్ చరణ్ తో ఒక సినిమా, విజయ్ తో మరొకటి చేస్తున్నాను. ఇంకా కొన్ని సినిమాల్ని అనౌన్స్ చేయాల్సి ఉంది.

ప్ర) చివరగా ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’ గురించి ఏమైనా చెప్తారా ?
జ) అందరూ ఈ సినిమా ఒక రేసీ థ్రిల్లర్ అని అనుకుంటున్నారు. ఫైట్స్ తో పాటు ఈ సినిమాలో ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. నా కష్టాన్ని ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది.

 
Like us on Facebook