ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రుక్సార్ మీర్ – రాజమౌళిగారి ప్రశంస చాలా ప్రోత్సాహానిచ్చింది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రుక్సార్ మీర్ – రాజమౌళిగారి ప్రశంస చాలా ప్రోత్సాహానిచ్చింది !

Published on Feb 7, 2017 8:52 PM IST


రాజమౌళి కజిన్ ఎస్ఎస్ కాంచి దర్శకత్వం వహించిన ‘షో టైం’ చిత్రం ఇటీవలే ఆడియో విడుదల జరుపుకుంది. ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్బంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రుక్సార్ మీర్ ఈ చిత్ర అనుభవాలను 123తెలుగుతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది ?
జ) మాది నార్త్ ఇండియా. కానీ కర్ణాటకలో సెటిలయ్యాం. నా చదువు పూర్తయ్యాక సొంతగా బేకరీ పెట్టి చెఫ్ అవుదామనుకున్నా. కానీ నాకు ఫ్యాషన్ ఫీల్డ్ తో టచ్ ఉండటం వలన పలు సందర్భాల్లో చేసిన ర్యాంప్ వాక్ ఫోటోలు చూసి ఈ సినిమాలో అవకాశమిచ్చారు.

ప్ర) మొదటి సినిమా విడుదలకు ముందే రెండవ సినిమా కూడా రిలీజుకు సిద్ధంగా ఉంది. ఎలా ఫీలవుతున్నారు ?

జ) చాలా హ్యాపీగా ఉంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా ‘ఆకతాయి’ కూడా ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజుకు రెడీగా ఉండటం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. తెలుగులో ప్రాజెక్ట్స్ దక్కడమంటే కాస్త కష్టమైనా విషయమే. కానీ నాకు ఇలా రెండు ప్రాజెక్ట్స్ ఉండటం సంతోషంగా ఉంది.

ప్ర) సినిమా గురించి, మీ పాత్ర గురించి కాస్త చెప్పండి ?

జ) ఈ సినిమాలో నాది ఈ జెనరేషన్ అమ్మాయి పాత్ర. స్వతంత్ర్య భావాలను కలిగి ఉంటుంది. మన నిజ జీవితంలో రోజు జరిగే సంఘటనలతో ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ట్రైలర్ చూసి అందరూ హర్రర్ సినిమా అనుకుంటున్నారు. కానీ కాదు. సినిమా తీసిన తీరు అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది.

ప్ర) ఎస్ఎస్ కాంచి తో పని చేయడం ఎలా ఉంది ?

జ) ఆయనకు టెలివిజన్ వైపు చాలా అనుభవం ఉంది. నటుల నుండి ఏం కావాలి అనే దానిపై ఆయన చాలా స్పష్టంగా ఉంటారు. నన్ను చాలా ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బాగా పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడింది.

ప్ర) ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ప్రభావం ఎలా ఉంది ?

జ) కాంచిగారు, రాజమౌళి, కీరవాణి లు ఒకే కుటుంబ సభ్యులని అందరికీ తెలుసు. వీరంతా ఒకరికొకరు చాలా బాగా సాయం చేసుకుంటారు. కీరవాణిగారు అప్పుడప్పుడు సెట్స్ కి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసేవారు. టీజర్ చూసి రాజమౌళిగారు కూడా నా నటనను మెచ్చుకున్నారట. అది ఇంకా బాగా పనిచేయడానికి సహకరించింది.

ప్ర) క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?

జ) ఆకతాయిలో నాది కాలేజ్ స్టూడెంట్ పాత్ర. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు వేరు వేరుగా ఉంటాయి. రెండింటిలోనూ నటనకు ఆస్కారముంది. ఒకసారి ఆకతాయి షూటింగ్ అప్పుడు రెండు పేజీలు ఆడైలాగుని ఒకే టేక్ లో చెప్పాను. అందరూ నన్ను మెచ్చుకున్నారు.

ప్ర) ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ?

జ) ప్రస్తుతానికి పూరి కనెక్ట్స తో ఒప్పందంలో ఉన్నాను. వాళ్ళు నాకు మంచి సినిమాలు ఇస్తారని అనుకుంటున్నాను. ఏ పరిశ్రమైన నాకు భాష అడ్డంకి కాదు. ఎక్కడైనా సరే కష్టపడి పని చేయాలని అనుకుంటాను. అలానే చేస్తాను. నా దారిలో ఎలాంటి పాత్ర వచ్చిన కాదనను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు