ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: వేణు ఊడుగుల – సినిమాలో తల్లిదండ్రుల కోసం బలమైన సందేశం ఉంటుంది !
Published on Mar 21, 2018 8:10 pm IST

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో శ్రీ విష్ణు నటించిన ‘నీది నాది ఒకే కథ’ కూడ ఒకటి. చిత్ర విడుదల సందర్బంగా దర్శకుడు వేణు ఊడుగుల మాతో పలు విశేషాల్ని పంచుకున్నారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం ఏమిటి ?
జ) నాకు చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. మొదట్లో బస్సు కండెక్టర్ అవ్వాలని ఉండేది. కానీ తర్వాత తర్వాత సినిమాలంటే ఆసక్తి పెరిగింది. 2008లో ఇండస్ట్రీకి వచ్చాను. మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను.

ప్ర) మొదటి సినిమా చేయడానికి ఇంత సమయం ఎందుకుపట్టింది ?
జ) మంచి సినిమా చేయాలనేది నా కోరిక. అందుకే అనేక స్క్రిప్ట్స్ పట్టుకుని ఎంతో మంది దర్శకుల వద్దకు తిరిగాను. నా బ్యాడ్ లక్ ఏమిటంటే కొన్ని సినిమాలు మొదలై చిత్రీకరణకు వెళ్లకుండా ఆగిపోయాయి.

ప్ర) ఈ సినిమాలో ఎలాంటి సామాజిక సందేశం ఉంది ?
జ) ఈరోజుల్లో పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులతో సహా అందరూ డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వాల్సిందేనని వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి ఈ సమాజంలో ఒక నార్మల్ కుర్రాడు తల్లిదండ్రుల నుండి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కున్నాడు, వాళ్లకి వ్యతిరేకంగా వెళ్లి ఎలా సక్సెస్ అయ్యాడు అనేదే సినిమా.

ప్ర) ఈ కథకు శ్రీవిష్ణునే ఎందుకు చూజ్ చేసుకున్నారు ?
జ) నా మనసులో చాలా మంది హీరోలను అనుకున్నా. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలోనే నా కో డైరెక్టర్ శ్రీవిష్ణు పేరును సజెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కలిశాను, ఆయన కథ విని సినిమాకు ఒప్పుకున్నారు.

ప్ర) శ్రీవిష్ణు ఎలా నటించాడు ?
జ) ఈ సినిమాలో శ్రీ విష్ణు యొక్క పూర్తిస్థాయి నటనను చూడొచ్చు. ఒక సాధారణ యువకుడిగా ఆయన నటించిన తీరు, చిత్తూరు యాసను స్పష్టంగా మాట్లాడటం ఆకట్టుకుంటాయి. సినిమా రిలీజయ్యాక ఆయన గురించే మాట్లాడుకుంటారు.

ప్ర) హీరో తండ్రి పాత్రకు డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గారైన ఎందుకు ఎంచుకున్నారు ?
జ) ముందుగా ఆ పాత్రకు సముథిరకనిగారిని అనుకున్నాం. కానీ ఆయన బిజీగా ఉండటంతో కుదరలేదు. ఆ సమయంలో మా టీమ్ మెంబర్ ఒకరు దేవిశ్రీగారిని సజెస్ట్ చేశారు. తండ్రి పాత్రలో అయన చాలా గొప్పగా నటించారు.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి గంటసేపు నాతో మాట్లాడారు. మంచి మౌత్ టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే పెద్ద బ్యానర్లు వస్తున్నాయి. త్వరలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తాను.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook