ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేత థామస్ ఇప్పుడు కాస్త లిమిటెడ్ గానే సినిమాలు చేస్తుంది. అయితే హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాల్లో మెయిన్ పాత్రల్లో కూడా ఆమె సినిమాలు ఓకే చేస్తుండగా అలా ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ ని ఆమె ఓకే చేసినట్టుగా ఎక్స్ క్లూజివ్ సమాచారం ఇపుడు తీసుకొచ్చాం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి లీడింగ్ నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా ఒకరు.

మరి వారు దర్శకుడు గౌరీని పరిచయం చేస్తున్నారు. మరి ఈ దర్శకుడు ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి పెద్దలక్ష్మి గారు జీవిత చరిత్రని బయోపిక్ గా తీస్తున్నట్టుగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక పాత్రను నివేత థామస్ పోషించనున్నట్టుగా మాకు తెలిసింది. దీనితో ఈ ఎక్స్ క్లూజివ్ వార్తను మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం. మరి ఈ సినిమా నివేతకి మొదటి బయోపిక్ సినిమా కాగా దీనిపై అధికారిక ప్రకటన అవన్నీ ముందు రోజుల్లో రానున్నాయి.

Exit mobile version