“రావణాసుర” ఫస్ట్ సింగిల్ పై ఆసక్తి.!

Published on Feb 6, 2023 2:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ మరియు పూజిత పొన్నాడ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర”. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం నుంచి ఈరోజు మేకర్స్ అయితే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి లాక్ చేసినట్టుగా తెలిపారు.

అయితే ఈ సాంగ్ కోసం మాత్రం ఫ్యాన్స్ సహా మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొదటి నుంచీ ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ తో సినిమా కాన్సెప్ట్ పై ఆసక్తి రేపారు. ఇప్పుడు ఇది ఈ సినిమా థీమ్ సాంగ్ కాగా దీనితో సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది రివీల్ కానుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి హర్ష వర్ధన్ మరియు భీమ్స్ లు సంగీతం అందించగా ఈ ఏప్రిల్ 7న ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం :