“సర్కారు వారి పాట” పై ఇంచ్ బై ఇంచ్ పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 19, 2022 7:03 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మొట్ట అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం మహేష్ అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఒక వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ గా మారగా దీనిపై అంచనాలు మాత్రం ఇప్పుడు ఇంచ్ బై ఇంచ్ ఇంకో లెవెల్ లోకి వెళ్తున్నాయని చెప్పాలి.

కాస్త ఆలస్యంగా వస్తున్నా సరే ఒక్కో అప్డేట్ ఇస్తున్న హై మాత్రం చాలా గట్టిగానే ఉంది. లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్స్ కూడా అంతే అని చెప్పాలి. దీనితో ఈ సినిమాలో మాత్రం మళ్లీ పాత మహేష్ బాబు ని చూడడం గ్యారెంటీ అని మహేష్ ఫ్యాన్స్ అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిపోయారు. ముఖ్యంగా దర్శకుడు పరశురాం పెట్ల టేకింగ్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ మే 12 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :