భీమ్లా నాయక్ అప్డేట్ పై పెరుగుతున్న అంచనాలు.!

Published on Aug 1, 2021 12:03 pm IST


ఇప్పుడు టాలీవుడ్ లో మన స్టార్ హీరోల సినిమాల నుంచి వరుస అప్డేట్స్ తో వారి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి రేస్ లో సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా మరో అసలు సినిమా అప్డేట్ చాలా ఆసక్తిగా మారింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్..

అయ్యప్పణం కోషియం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ రీస్టార్ట్ చేయడంతోనే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం వస్తుంది అని తెలిపారు. ఆ తర్వాత రెబల్ స్టేర్ ప్రభాస్ రాధే శ్యామ్ అలాగే నిన్ననే సూపర్ స్టార్ మహేష్ తన సర్కారు వారి పాట చిత్రాలు డేట్స్ తెచ్చేసుకోగా ఇక భీమ్లా నాయక్ ఎంట్రీ పై అందరి కళ్ళు పడ్డాయి.

దీనితో ఈ చిత్రం డేట్ ఎప్పుడు వస్తుంది అన్న దానిపై అప్డేట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మాస్ అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :