రజినీ సినిమాపై పెరుగుతున్న అంచనాలు.!

Published on Oct 28, 2021 10:00 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ తన స్టార్డం కి తగ్గ భారీ హిట్ అందుకుంటే చూద్దాం అని అంతా ఎప్పుడు నుంచో అనుకుంటున్నారు కానీ అది మాత్రం తలైవర్ అభిమానులకు కాస్త దూరంగానే ఉంది. కానీ ఈసారి మాత్రం తన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తెలుగులో “పెద్దన్న” గా రిలీజ్ అవుతున్న సినిమా పై మాత్రం మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలాగే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో రజినీ స్ట్రాంగ్ కం బ్యాక్ మళ్ళీ కన్ఫర్మ్ అని వైబ్స్ అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయ్యాయి. రెండు భాషల్లో కూడా ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో రజినీ సినిమా దీపావళి కానుకగా రజినీ అదిరే ట్రీట్ ఇవ్వబోతున్నట్టు అర్ధం అవుతుంది.

మరి స్టార్ దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తి సురేష్ రజినీ సోదరి పాత్రలో నటించగా సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :