‘అర్జున్ రెడ్డి’ రన్ టైం ను ఇంకాస్త పెంచనున్నారు !


విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగు యువతను ఒక ఊపు ఊపేస్తోంది. సినిమాలో ఏం నచ్చిందనే ప్రశ్న వస్తే చాలా అంశాలనే ప్రస్తావిస్తున్నారు ప్రేక్షకులు. అంతలా సక్సెస్ అయిన ఈ సినిమా యొక్క రన్ టైమ్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలొచ్చాయి. 3 గంటల సమయం పాటు ప్రేక్షకుడ్ని థియేటర్లలో కూర్చోబెట్టడమంటే సాహసమని అన్నారు. కానీ దర్శకుడు సందీప్ వంగ మాత్రం ఇప్పటికే 40 నిముషాలు ట్రిమ్ చేశామని, 3 గంటల రన్ టైమ్ సమస్య కాదని ధీమా వ్యక్తం చేశారు .

ఆయన నమ్మకం ప్రకారమే ప్రేక్షకులు 3 గంటల సినిమాను ఈజీగా ఎంజాయ్ చేసేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ కట్ చేసిన ఇంకో 15 నిముషాల సన్నివేశాలని చిత్రానికి యాడ్ చేయాలని భావిస్తున్నట్టు విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చిస్తున్నామని, అన్ని కోణాల నుండి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఒకవేళ కొత్త సీన్లని యాడ్ చేస్తే కలెక్షన్లకి కొత్త బూస్ట్ దొరికినట్లవుతుంది.