ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్టేజ్‌పైకి అయ్యయ్యో వద్దమ్మా ఫేమ్ శరత్..!

Published on Dec 1, 2021 2:00 am IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి “ఎక్స్‌ట్రా జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎప్పటిలాగానే కామెడీ అంతకుముందు ఉందనే చెప్పాలి.

అయితే కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్, బుల్లెట్ భాస్కర్, సుడిగాలి సుధీర్ టీంలు తమదైన స్కిట్లతో అలరించాయి. రష్మీ, వర్షల మధ్య కామెడీకి రోజా పంచ్‌లు జోడీ అవ్వడం హిలేరియస్‌గా అనిపించింది. ఇదిలా ఉంటే ఇటీవల “అయ్యయ్యో వద్దమా” అనే డ్యాన్స్ ద్వారా శరత్ అనే అబ్బాయికి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. రాకింగ్ రాకేశ్ టీం ద్వారా ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్టేజ్‌పైకి వచ్చిన ఈ అబ్బాయి తనదైన స్టైల్‌లో ఒక డైలాగ్‌ని చెప్పి అందరిని నవ్వించాడు. మరీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను చూసేయాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :