ఎక్స్‌ట్రా జబర్దస్త్: ఒక్కరోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్..!

Published on Jan 21, 2022 1:06 am IST

తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయించే కార్యక్రమాల్లో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటూ ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వారానికి సంబంధించి “ఎక్స్‌ట్రా జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రోమో ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా లక్షకి పైగా లైక్స్‌ని కూడా రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్‌ హైలెట్స్ చూసుకుంటే సుధీర్ పుష్ప రాజ్ గెటప్‌లో అదరగొట్టాడు. గెటప్ శ్రీను ఫహద్ ఫాజిల్ పాత్రలో కనిపించి అలరించాడు. ఇక ఎప్పటిలాగానే బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేశ్ వెంకీ మంకీస్, రోహిణీ తమదైన స్కిట్లతో అలరించారు. మరీ ఈ ఫుల్ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే నేడు రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను తప్పక చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :