“ఎక్స్ట్రా జబర్దస్త్” లేటెస్ట్ స్పెషల్ ప్రోమోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

“ఎక్స్ట్రా జబర్దస్త్” లేటెస్ట్ స్పెషల్ ప్రోమోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Mar 24, 2022 11:54 AM IST

మన తెలుగు బుల్లితెర దగ్గర ప్రతి వారం కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి వారం కూడా ఒక్కో ఇంట్రెస్టింగ్ షో తో ఎంటర్టైన్మెంట్ ని అందించే ఛానెల్ ఈటీవీ. మరి వీరి నుంచి ప్రతు గురువారం మరియు శుక్రవారం ప్రసారం అయ్యే “జబర్దస్త్”, “ఎక్స్ట్రా జబర్దస్త్” షోల నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి లేటెస్ట్ గా రేపు మార్చ్ 25 శుక్రవారం కి సంబంధించిన “ఎక్స్ట్రా జబర్దస్త్” కొత్త ప్రోమో రావడం జరిగింది. మరి ఈ ప్రోమో మాత్రం అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఫస్ట్ స్కిట్ నుంచి లాస్ట్ స్కిట్ వరకు ఒకటే లైన్ ఎంటర్టైన్మెంట్ తో హిలేరియస్ కామెడీ తో కనిపిస్తుంది. అలాగే ప్రముఖ నటి లైలా ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ కం జడ్జ్ గా మెరవడం హైలైట్ కాగా..

మరోపక్క రోజా, ఆమని మరియు లైలా లపై చేసిన ఓ స్పెషల్ స్కిట్ కూడా మంచి అట్రాక్షన్ గా కనిపిస్తుంది. అలాగే సుడిగాలి సుధీర్ స్కిట్ గాని, భాస్కర్ స్కిట్ గాని అన్నిటితో కలిపి అదిరిన ఈ ప్రోమోకి అంతే స్థాయి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం విశేషం. కేవలం 10 గంటల్లోనే 1.5 మిలియన్ వ్యూస్ ఈ ప్రోమోకి వచ్చేసాయి. మరి రేపు ప్రసారం అయ్యే ఈ సూపర్ స్పెషల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మీ ఈటీవీలో మిస్సవ్వకుండా చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు