మెగాస్టార్ “గాడ్ ఫాదర్” కి పెరుగుతున్న థియేటర్లు!

Published on Oct 7, 2022 2:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో జయం మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గాడ్ ఫాదర్. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ కి ఇది అధికార రీమేక్. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం కి మంచి టాక్ రావడం మాత్రమే కాకుండా, మౌత్ టాక్ కూడా బాగుండటం తో గ్రౌండ్ లెవెల్ లో సినిమా కి క్రేజ్ పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదనపు షోలు, థియేటర్లు చేరాయి. సినిమా విజయవంతమైందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. నయనతార, సునీల్, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాధ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ సహకారంతో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :