పుష్ప: “ఏయ్ బిడ్డా” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

Published on Jan 12, 2022 12:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. గత నెల 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు సంబంధించి పలు వీడియోలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” సాంగ్ ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా నకాష్ అజిజ్ ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇకపోతే ఈ పాటలో ఒక షాట్ కోసం పుష్పరాజ్ 12గంటల పాటు శ్రమించాడని చిత్ర బృందం ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :