ఫన్ అండ్ రొమాంటిక్ గా “ఎఫ్3” నుంచి లేటెస్ట్ సింగిల్ ప్రోమో.!

Published on Apr 20, 2022 10:17 am IST

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సీక్వెల్ సినిమా మరియు మల్టీ స్టారర్ “ఎఫ్ 3” కోసం తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు మరో సాంగ్ తాలూకా ప్రోమోని రిలీజ్ చేసారు.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కూడా తన మార్క్ లోనే ఇంట్రెస్టింగ్ బీట్ లోనే ఉండగా మెయిన్ లీడ్ మధ్య ఓ పక్క రొమాన్స్ మరియు దర్శకుడు అనీల్ రావిపూడి కామెడీ ట్రాక్ లు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ సాంగ్ మంచి ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 22 వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ మే 27న రిలీజ్ చెయ్యబోతున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :