విక్టరీ ‘వెంకటేశ్ ,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కాంబినేషన్లో రూపొందనున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ . ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో వెంకటేశ్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహరీన్ నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన్చనున్నారు .ఈ సినిమాని ఈనెల 23న గ్రాండ్ గా లాంచ్ చేసి జులై మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు . తొలిసారి వెంకటేశ్ ,వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నఈ సినిమాని ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనుడడంతో తో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు .
