‘ఎఫ్ 2’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్.. !

ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎఫ్2’ ముందు వరుసలో నిలుస్తూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలైన 6వ రోజు కూడా ‘ఎఫ్ 2’ నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

కాగా ‘ఎఫ్ 2’ 6వ రోజుకు గానూ నైజాంలో 1.59 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికే ముప్పై మూడు కోట్ల మార్క్ ను దాటిన ఈ చిత్రం.. ఈజీగా ఏభై కోట్లను క్రాస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Exit mobile version