“ఎఫ్ 3” నాలుగు రోజుల టోటల్ వసూళ్ల వివరాలు ఇవే.!

Published on May 31, 2022 2:00 pm IST


ఈ ఏడాదికి వేసవి కానుకగా వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న లేటెస్ట్ చిత్రం “ఎఫ్ 3”. వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా అలాగే తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్నట్టు గానే ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ అందుకోగా సూపర్ వసూళ్ళని కొల్లగొడుతుంది. నిన్న సోమవారం కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలిచి స్టడీ వసూళ్లను అందుకున్నట్టుగా ఇప్పుడు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఈ నాల్గవ రోజు వసూళ్లు ఏరియాల వారీగా చూస్తే..

నైజాం – 2.03 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.66 కోట్లు
గుంటూరు – 0.28 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.20 కోట్లు
తూర్పు గోదావరి – 0.34 కోట్లు
నెల్లూరు – 0.14 కోట్లు
కృష్ణ – 0.28 కోట్లు
సీడెడ్ – 0.71 కోట్లు

మొత్తం 4.64 కోట్ల షేర్ ని ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రాబట్టగా.. మొత్తం 4 రోజులకి గాను 32.11 కోట్లు షేర్ ని ఈ చిత్రం రాబట్టింది. ఇక అలాగే దీనితో పాటుగా ఓవర్సీస్ లో అయితే 2.13 మిలియన్ వసూళ్లతో బెటర్ గా దూసుకెళ్తుంది. ఇక సోమవారమే మంచి వసూళ్లు నమోదు అయితే ఇక ఈరోజు నుంచి కూడా మంచి వసూళ్లు రావడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :