“ఎఫ్ 3” వరల్డ్ వైడ్ క్లోజింగ్ వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Jul 5, 2022 3:45 pm IST


ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మరో మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. మరి వీరితో పాటుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ముందు ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఫ్రాంచైజ్ ని కొనసాగిస్తూ చేసిన ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఇప్పుడు 50 రోజులు దిశగా కొనసాగుతుంది. మరి లేటెస్ట్ పి ఆర్ టీం చెప్తున్న దాని ప్రకారం అయితే ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం- 20.57 కోట్లు
ఉత్తరాంధ్ర – 7.48 కోట్లు
ఈస్ట్- 4.18 కోట్లు
వెస్ట్ – 3.41 కోట్లు
కృష్ణ – 3.23 కోట్లు
గుంటూరు- 4.18 కోట్లు
నెల్లూరు- 2.31 కోట్లు
సీడెడ్- 8.58 కోట్లు
కర్ణాటక – 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 10 కోట్లు

మొత్తం ఏపీ మరియు తెలంగాణాలో జి ఎస్ టి తో కలిపి 53.94 కోట్లు షేర్ రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 70.94 కోట్లు షేర్ ని అలాగే 134 కోట్లు గ్రాస్ ని రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :