“ఎఫ్ 3” మూవీ 17 రోజుల వసూళ్లు ఎంతంటే?

“ఎఫ్ 3” మూవీ 17 రోజుల వసూళ్లు ఎంతంటే?

Published on Jun 14, 2022 3:00 AM IST

వెంకటేశ్ – వరుణ్ తేజ్ కథనాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ తోనే మొదలైన ఈ సినిమా తొలివారంలో చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టినా, ఆ తరువాత మాత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టుకోలేదు. దీంతో కలెక్షన్స్ గ్రాఫ్ కాస్త రోజు రోజుకు పడిపోతూ వచ్చింది.

అయితే మొత్తం 17 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజాంలోనే 18.70 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 65.64 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ‘ఎఫ్ 2’ సినిమాకి మించి ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. కామెడీ పాళ్లు.. రొమాంటిక్ పాళ్లు పెంచాడు. దాంతో ఆర్టిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆశించిన స్థాయిని, అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఎఫ్ 2’ సినిమాలో సందర్భాన్ని బట్టి నవ్విస్తూ వచ్చిన అనిల్ రావిపూడి, ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో నవ్వించడానికి ప్రయత్నించాడనే టాక్ వచ్చింది. ఇక ‘ఎఫ్ 2’ సినిమాలో రఘుబాబు, అన్నపూర్ణమ్మ, వై విజయ, మెహ్రీన్ వైపు నుంచి ఉన్న కామెడీ మరియు మేనరిజమ్స్ ఈ సినిమాలో లోపించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు