ఈ రెండు ఓటీటీ యాప్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఎఫ్ 3”.!

ఈ రెండు ఓటీటీ యాప్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఎఫ్ 3”.!

Published on Jul 22, 2022 7:02 AM IST

ఈ ఏడాది మన టాలీవుడ్ దగ్గర మంచి హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో క్రేజీ మల్టీస్టారర్ విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన చిత్రం “ఎఫ్ 3” కూడా ఒకటి. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన లాస్ట్ బిగ్ హిట్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం కూడా మంచి హిట్టయ్యింది. అయితే ఈ సినిమా తోనే మేకర్స్ ఓ కొత్త సంప్రదాయం కూడా తీసుకొచ్చారు.

8 వారాల తర్వాతే ఓటీటీ లో రిలీజ్ అని అనౌన్స్ చేసి ఫైనల్ గా అదే మాటపై సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈరోజు జూలై 22 నుంచి ఈ చిత్రం రెండు ప్రముఖ యాప్ లు సోనీ లివ్ సహా నెట్ ఫ్లిక్స్ లలో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈరోజు నుంచి మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఖాయం అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో కూడా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్ లుగా నటించగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది, సోనాల్ చౌహన్ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు