సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఫన్ ఎంటర్ టైనర్ “ఎఫ్3”

Published on May 20, 2022 3:31 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. ఎఫ్3 యొక్క థియేట్రికల్ ట్రైలర్‌తో చాలా వినోదాన్ని అందించారు. సినిమాలోని పాటలు కూడా తగినంత గ్లామర్ డోస్‌ని ఇచ్చాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. 2:28 గంటల నిడివితో ఉన్న ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. అనిల్ రావిపూడి చాలా మంది ఆర్టిస్టులతో కామెడీని డీల్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మరియు ప్రతి నటుడికీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.

తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో రెండు పాటలు ఉండగా, సెకండాఫ్‌లో పూజా హెగ్డే పార్టీ సాంగ్‌తో సహా రెండు పాటలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఎఫ్3 మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. F3 చిత్రం F2 కంటే రెట్టింపు వినోదాన్ని అందించబోతోంది మరియు నివేదికల ప్రకారం చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :