స్ట్రాంగ్ వసూళ్లతో “ఎఫ్ 3”..5వ రోజు వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Jun 1, 2022 2:00 pm IST


లేటెస్ట్ సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో దర్శకుడు అనిల్ రావిపూడి తమ హిట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా అన్ని అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ హిట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సమ్మర్ సోగ్గాళ్లు వీక్ డేస్ లోకి వచ్చాక కూడా స్ట్రాంగ్ వసూళ్లతో అదరగొడుతున్నారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా 5వ రోజు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

మరి ఈ ఐదవ రోజు ఏపీ తెలంగాణాలో ఈ చిత్రం 3.17 కోట్లు షేర్ రాబట్టగా మొత్తం 5 రోజులకి కలిపి ఈ చిత్రం 35.28 కోట్లు షేర్ ని అందుకుంది. ఈజీగా 50 కోట్ల షేర్ దిశగా దూసుకెళ్తుంది. ఇక మళ్ళీ వారాంతానికి వచ్చేసరికి మరింత మంచి ఫిగర్స్ నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, సోనాల్ చౌహన్ లు మెరవగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :