“ఎఫ్ 3” ఫస్ట్ వీక్ వసూళ్ల వివరాలు..మళ్ళీ 100 కోట్ల దిశగా..!

Published on Jun 3, 2022 1:30 pm IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3”. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఎఫ్ 2 కన్నా బెటర్ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంతో భారీ వసూళ్లే ఈ సినిమాకి నమోదు అవుతున్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర అయితే మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వసూళ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి ఏరియాల వారీగా ఈ వసూళ్లు చూస్తే..

నైజాం – 17 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.42 కోట్లు
తూర్పు గోదావరి – 3.2 కోట్లు
వెస్ట్ గోదావరి – 2.44 కోట్లు
సీడెడ్ – 6.7 కోట్లు
గుంటూరు – 3.20 కోట్లు
కృష్ణ – 3.1 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 41.06 కోట్లు షేర్ జి ఎస్ టి తో కలిపి రాబట్టింది. అలాగే ఓవర్సీస్ మరియు కర్ణాటక ఇతర వసూళ్లు కలిపి అయితే ఈ చిత్రం మొదటి వారం 52.1 కోట్లు షేర్ ని రాబట్టగా 94 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. దీనితో గత ఎఫ్ 2 సినిమా లానే ఈ చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ క్లబ్ కి వెళ్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :