లేటెస్ట్ : ‘ఎఫ్ 3’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ … ఎప్పుడంటే … ??

Published on Jul 3, 2022 2:00 am IST

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వరుస సక్సెస్ ల దర్శకడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రస్ట్రేషనల్ ఎంటెర్టైనర్ మూవీ ఎఫ్ 3. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది.

ఎఫ్ 2 కి మించి మరింత ఫన్ తో అనిల్ రావిపూడి తీసిన ఈ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తన గత సినిమాల మాదిరిగా ఆకట్టుకునే యాక్షన్, ఫన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీని తెరకెక్కించి మరొక్కసారి మంచి పేరు అందుకున్నారు. ఇక ఈ మూవీ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం సోని లైవ్ వారి ద్వారా జులై 22న ఎఫ్ 3 మూవీ ప్రసారం కానుంది. అటు థియేటర్స్ లో నవ్వులు పూయించి మంచి కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ మరి ఒటిటి ఆడియన్స్ నుండి ఎంత మేర రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :