“ఎఫ్ 3” ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ఇవే!

Published on May 23, 2022 5:45 pm IST


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27 వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల వరకు అయినట్లు తెలుస్తుంది. సినిమాకి మంచి టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా, సునీల్, అలీ, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :