హైదరాబాద్ లో మొదలైన “ఎఫ్ 3” షూటింగ్!

Published on Sep 18, 2021 1:33 am IST


వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో నేడు ప్రారంభం అయింది. అంతకుముందు ఎఫ్ 2 చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్ గా రానుంది. ఈ చిత్రం లో మొత్తం నటీనటులు పాల్గొన్నారు.

తాజాగా ఎఫ్ 3 చిత్ర యూనిట్ మేకింగ్ వీడియోను f3 ఫన్ డోస్ పేరిట విడుదల చేయడం జరిగింది. ఈ మేకింగ్ వీడియో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే ఈ సీక్వెల్ లో సునీల్ తనదైన శైలి లో కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణ లో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :