“ఎఫ్ 3” ఆ బాలీవుడ్ సినిమాకి దగ్గరిగా ఉంటుందా?

Published on Nov 11, 2021 2:18 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి “ఎఫ్ 3” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ సక్సెస్ సాధించిన “ఎఫ్ 2” సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ సినిమా కథ మాత్రం మొదటి పార్ట్ లాగా కాకుండా వేరేగా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇదివరకే చాలా సార్లు చెప్పారు.

కాగా ఈ సినిమా ఒక కన్ఫ్యూజింగ్ కామెడీగా తెరకెక్కనుందని, ఈ సినిమా కథ బాలీవుడ్ సినిమా “గోల్ మాల్ 3” కి దగ్గరగా ఉంటుందని టాక్. ఈ సినిమాతో కూడా అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :