షూటింగ్ జర్నీ పూర్తి చేసుకున్న “ఎఫ్3”.. నవ్వుల జర్నీ స్టార్ట్..!

షూటింగ్ జర్నీ పూర్తి చేసుకున్న “ఎఫ్3”.. నవ్వుల జర్నీ స్టార్ట్..!

Published on Jan 29, 2022 6:35 PM IST

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రిన్‌లు ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం “ఎఫ్3”. గతంలో వచ్చిన “ఎఫ్2” చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్ నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తైనట్టు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ వీడియోను పంచుకుంటూ “మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది.. వస్తే, కొద్దిగా ముందుగా.. వెళ్ళినా కొద్దిగా వెనకగా.. థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా” అని తెలిపింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానున్నట్టు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు