ప్రముఖ ఒటిటిలో ఫహాద్ ఫాసిల్ ‘మాలిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్ …. !

ప్రముఖ ఒటిటిలో ఫహాద్ ఫాసిల్ ‘మాలిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్ …. !

Published on Jul 29, 2022 2:00 AM IST

ప్రస్తుతం మలయాళం తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాలతో ఎంతో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్. కెరీర్ లో చేసిన అనేక పాత్రలలో తన అద్భుత నటనతో ఆడియన్స్ నుండి సూపర్ క్రేజ్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఫహద్ ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తో పాటు కమల్ హాసన్ విక్రమ్ మూవీస్ లో నటించారు. అయితే గత ఏడాది మహేష్ నారాయణ్ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ మాలిక్.

పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ గా పలు యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ మలయాళ మూవీ మోలీవుడ్ లో మంచి విజయం అందుకుంది. ఇక ఈ మూవీ తెలుగు డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా వారు దక్కించుకున్నారు. ఈ మూవీ ఆగష్టు 12న ఆహా ఆడియన్స్ ని అలరించనుంది. ఆకట్టుకునే కథనాలతో తెరకెక్కిన మాలిక్ తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని అంటోంది ఆహా యాజమాన్యం. కాగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ అయి మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు